
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్లో నేడు స్వల్ప నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప డౌన్ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్లు పడిపోయి 73,600 స్థాయికి దిగువన ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 3.5 పాయింట్లు తగ్గి 22,750 వద్ద స్థిరపడింది. ప్రధాన సూచీల్లో పెద్దగా కదలికలు లేకపోవడంతో మార్కెట్లు దాదాపు ఫ్లాట్గా ముగిశాయి.ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో ఒత్తిడిట్రేడింగ్ సమయంలో ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో నష్టాలు కనిపించాయి. దృష్టిరానున్న కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధాన నిర్ణయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కూడా మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.మరోవైపు మీడియా, రియల్టీ, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్ రంగాల షేర్లు లాభాల్లో కదలడంతో సూచీల పతనం పరిమితమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..