టెక్ హబ్ దిశగా ఏపీ ముందడుగు
టెక్ హబ్ దిశగా ఏపీ ముందడుగు
టెక్ హబ్ దిశగా ఏపీ ముందడుగు


అమరావతి, 03 అక్టోబర్ (హి.స.)

అమరావతి, :రాష్ట్రాన్ని టెక్నాలజీ, ఆవిష్కరణల హబ్గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడుతోంది. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, డీప్టెక్, స్టార్ట్పలు, డిజిటల్ ఆవిష్కరణల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ తదితర రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యానికి దేశంలోని ఐఐటీ పూర్వ విద్యార్థులు బాసటగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా పాన్ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో శనివారం విజయవాడ వేదికగా ‘పాన్ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026’ జరగనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ‘‘ఆంధ్రాస్ రెసిలెంట్ డీప్టెక్ డికేడ్: స్వర్ణాంధ్ర టూ వికసిత్ భారత్ 2047’’ థీమ్తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్ హాజరుకానున్నారు.

కార్యక్రమంలో ఏఐ, డీప్టెక్, క్వాంటం కంప్యూటింగ్, ఆవిష్కరణలు తదితర అంశాలపై చర్చలతో పాటు రౌండ్ టేబుల్ సమావేశాలుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పారిశ్రామికవేత్తలుగా, క్వాంటం కంప్యూటింగ్, హెల్త్ కేర్, ఆగ్రోటెక్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ వంటి రంగాల్లో నిష్ణాతులుగా స్థిరపడ్డ 5లక్షల మంది పాన్ ఇండియా ఐఐటీయన్లు బలమైన నెట్వర్క్గా ఏర్పడ్డారు. వీరంతా పెట్టుబడిదారులుగా, పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రసాంకేతిక నిపుణులుగా రాష్ట్ర ఆర్థిక స్వావలంబనకు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande