బొల్లారం ఆయుధాల చోరీ కేసులో ఉగ్ర కోణం లేదు.. పోలీస్ కమిషనర్ సుమతి
బొల్లారం ఆయుధాల చోరీ కేసుకు సంబంధించి మల్కాజిగిరి కమిషనరేట్ సీపీ సుమతి మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.
CP Sumathi


హైదరాబాద్, 03 అక్టోబర్ (హి.స.)

బొల్లారం ఆయుధాల చోరీ కేసుకు సంబంధించి మల్కాజిగిరి కమిషనరేట్ సీపీ సుమతి మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.

ఈ కేసును మల్కాజిగిరి, SOT, టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేశామన్నారు. ప్రధాన సూత్రధారి మల్లేేశును 11న అదుపులోకి తీసుకున్నామని.. గన్ని బ్యాగ్స్ ఉన్న గన్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మల్లేష్ను 10 రోజులు కస్టడీ తీసుకున్నామని, 10రోజుల పాటు విచారించామని అన్నారు. మేఘాలయాల, జమ్మూ, ఊటీలో 2025 వరకు పని చేసి మద్రాస్కి బదిలీ అయ్యాడన్నారు.

2022లో కలకత్తాలో సివిలియన్ను పరిచయం చేసుకున్నాడని చెప్పారు. బీర్ బార్ షా, అవి దే లను పరిచయం చేసుకున్నాడని అన్నారు. తరవాత కంట్రీ మేడ్ తపంచ గన్ తెచ్చుకున్నాడని చెప్పారు. భారీగా సంపాదించాలని, కోటీశ్వరుడు అవ్వాలనే దొంగతనం చేశాడన్నారు. మద్రాస్ రెజిమెంట్లో గతంలో పనిచేశాడని, స్నేహితుడు శేషుతో పాటు వినోద్ కోట్ ఇంచార్జ్, ప్రవీణ్ తో పరిచయం పెంచుకున్నాడని చెప్పారు.

నిందితులు స్కూటీతో లోపలికి వెళ్ళి రాడ్తో తాళాలు పగలగొట్టి చోరీ చేశారని చెప్పారు. మల్లేష్ దొంగతనం చేసిన తరవాత... రండి పూర్తైంది.. అంటూ ప్రవీణ్ కి మెసేజ్ చేశాడన్నారు. మల్లేష్ వాట్సప్ కాల్స్, మిగతా కాల్స్ డేటా మొత్తం డిలీట్ చేశాడని, అన్ని ఎవిడెన్స్ తీసుకున్నామని తెలిపారు. శేషు పాకిస్తాన్ సోషల్ మీడియా అకౌంట్స్ ఫాలో అవుతున్నాడని, కోట్ ఇంచార్జ్ వినోద్ సీసీ కెమెరా, సెంట్రింగ్ డ్యూటీ, అన్ని తెలుసుకుంటాడని తెలిపారు. వినోద్ రెగ్యులర్ టైమ్ కంటే ముందే విజిటింగ్ చేస్తాడని చెప్పారు.

అందరూ కలిసి ఒకే స్థలంలో ఉన్నారని వెల్లడించారు. మల్లేష్ నుండి వినోద్ లక్ష రూపాయలు ఫుడ్ బాల్ గ్రౌండ్ లో తీసుకున్నాడని చెప్పారు. వినోద్ ఒక పిస్టల్ పోయిందని ఫిర్యాదు చేశాడని, అప్పుడే ప్రవీణ్ పాత్ర కూడా ఇందులో ఉందని అర్థమైందన్నారు. ఈ కేసులో ఎక్కడా ఉగ్రకోణం లేదని సీపీ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande