బంగారం ధరలు భారీగా పడిపోతాయా?... పసిడి ధరలు మరింత ప్రియం
నేడు అక్టోబర్ మూడో తేదీ, శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,895 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,750 పలుకుతోంది.
Bullion-Market-Gold-Silver


ముంబై, 03 అక్టోబర్ (హి.స.)నేడు అక్టోబర్ మూడో తేదీ, శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,895 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,750 పలుకుతోంది.

ఒక కేజీ వెండి ధర రూ. 2,30,000 పలుకుతోంది. బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు అక్టోబర్ నెల చివరి వారంలో వడ్డీ రేట్లు పెంచుతుంది అని వార్తలు రావడమే దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు.

భారతీయ మార్కెట్లో గతంలో బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో ఆభరణాల కొనుగోలు సామాన్యులకు భారంగా మారింది. దీనికి తోడు దేశంలో దిగుమతి సుంకం కూడా ఎక్కువగా ఉండటంతో ధరలు మరింత పెరిగాయి. అయితే త్వరలోనే ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించే ఆలోచనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఫిజికల్ గోల్డ్ పై ఒత్తిడి మరింత తగ్గి, ఆభరణాల ధరలు సామాన్యులకు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande