మంచిర్యాల పట్టణంలో కార్డెన్ సెర్చ్.. పోలీసుల కీలక సూచనలు
మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
Police


మంచిర్యాల, 03 అక్టోబర్ (హి.స.)

నేడు (శనివారం )మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గంగారెడ్డి రోడ్డు, మార్కెట్ రోడ్డులో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని మంచిర్యాల డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎగ్గాడి భాస్కర్ ప్రజలను హెచ్చరించారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు తప్పవని వాహన చోదకులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు.

నిబంధనలు ఉలంఘిస్తే ఆర్టీఓ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. రానున్నదసరా, దీపావళి సందర్భంగా తెలంగాణలోనే మెజారిటీ సభ్యులు నిర్వహించుకునే దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రం మంచిర్యాల పట్టణంలో వ్యాపార సముదాయాల ప్రాంతాల్లో జన సందోహం పెరిగిపోతుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande