
హైదరాబాద్, 03 అక్టోబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన చిక్కుముడులను విప్పుతూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీపి కబురు అందించారు.
రాష్ట్రంలో ఏళ్ల తరబడిగా నలుగుతున్న 22-ఏ భూ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తగిన నాలా రుసుము చెల్లించి, అర్హత ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలుగా మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై రెవెన్యూ శాఖ ప్రత్యేకంగా మెమో 30. 48062/ULC/A1/2026 ద్వారా అధికారిక ఉత్తర్వులు వెలువరించింది.
అర్హత ఉన్న దరఖాస్తులను నిర్దిష్ట కాలపరిమితిలోగా వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి మార్గదర్శకాలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..