నీటి సంరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి.. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్
నీటి సంరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డా. కొప్పిశెట్టి కిరణ్మయి అధికారులను ఆదేశించారు.
Collector


హైదరాబాద్, 03 అక్టోబర్ (హి.స.)

నీటి సంరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డా. కొప్పిశెట్టి కిరణ్మయి అధికారులను ఆదేశించారు.

శనివారం జిల్లాలోని కడ్తాల్ మండల కేంద్రంలో కందుకూర్ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఎల్నినో ప్రభావంతో వర్షాకాల పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో నీటి సంరక్షణపై క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గ్రామాల్లోని నీటి వనరులను సంరక్షించడంతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యం, పెండింగ్ అభివృద్ధి పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande