ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అండ.. వర్ధన్నపేట ఎమ్మెల్యే
ఆర్టీసీ డిపోల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Mla


వరంగల్, 03 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నేపథ్యంలో శనివారం హనుమకొండ, వరంగల్ పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఆర్టీసీ కార్మికుల హక్కులను కాపాడడంతో పాటు ఉద్యోగ భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డితో కలిసి హనుమకొండ డిపో పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ...ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వారు చేస్తున్న కృషి అభినంద నీయమని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande