జెపీఎన్సీఈ కళాశాల ఒక సరస్వతీ నిలయం : వెంకయ్య నాయుడు
'ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం-2026' కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Venkaiah Naidu


హైదరాబాద్, 03 అక్టోబర్ (హి.స.)

నగరంలోని నాంపల్లి ప్రాంగణంలో గల సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం డా.ఎన్టీఆర్ కళామందిరంలో శనివారం ఉదయం నిర్వహించిన 'ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం-2026' కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహబూబ్ నగర్ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఒక సరస్వతీ నిలయం అని వ్యాఖ్యానించారు.

జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న ఒక సుప్రసిద్ధ యూజీసీ స్వయంప్రతిపత్తి గల సంస్థ అని ఆయన ప్రశంసించారు.

గత మూడు దశాబ్దాలుగా ఉన్నత విద్యకు ఒక ప్రతిష్టాత్మక కేంద్రంగా అభివృద్ధి చెందుతూ, నాణ్యమైన సాంకేతిక విద్య, ఉత్తమ బోధన, అత్యున్నత ఫలితాలు, అత్యధిక క్యాంపస్ ప్లేస్మెంట్ లతో అంకిత భావంతో పనిచేస్తుందని వెంకయ్యనాయుడు కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande