
హైదరాబాద్, 03 అక్టోబర్ (హి.స.) ఎన్నికల కమిషన్ పై వనపర్తి శాసనసభ్యులు తూడీ మెగారెడ్డి నేడు కీలక వాఖ్యలు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు మీడియాతో మాట్లాడుతూ..చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ పార్టీ సర్ ను అడ్డుపెట్టుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఓటర్లను తొలగిస్తూ ఓటు చోరికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
భారత ఎన్నికల కమిషన్ చైర్మన్ ఏకపక్ష పోకడలకు ఓటర్లు సతమతమవుతున్నారని విమర్శించారు. ఎన్నోఏండ్లుగా గడిచిన పలుదఫాల ఎన్నికలో తమ ఓటు హాక్కును వినియోగించుకున్న ఓటర్లను సైతం ఓటు హక్కుకు ధ్రువీకరణ కోసం ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.
నియంతలా వ్యవహరిస్తున్న ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని లేని పక్షంలో ప్రధానమంత్రి మోడీ అందుకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు