ఆసియా ఆర్చరీలో మరో గోల్డ్.. తొలి భారత మహిళగా కుంకుమ్ మొహోద్
ఆసియా ఆర్చరీలో మరో గోల్డ్.. తొలి భారత మహిళగా కుంకుమ్ మొహోద్ సరికొత్త చరిత్ర సృష్టించింది
ఆసియా   ఆర్చరీలో మరో గోల్డ్.. తొలి భారత మహిళగా కుంకుమ్ మొహోద్


ఢిల్లీ, 03 అక్టోబర్ (హి.స.)ఆసియా క్రీడలు 2026లో భారత యువ ఆర్చర్ కుంకుమ్ మొహోద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ విభాగంలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల చరిత్రలోనే వ్యక్తిగత రికర్వ్ విభాగంలో పసిడి పతకం సాధించిన తొలి భారత మహిళగా కుంకుమ్ రికార్డు పుటలకెక్కింది.

ఈ విభాగంలో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత మహిళగా కుంకుమ్ రికార్డు నెలకొల్పింది. టోర్నీ ఆరంభం నుంచే అద్భుత ప్రదర్శన కనబరిచిన కుంకుమ్.. కీలక మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో కొరియాకు చెందిన యుజెన్పై ఆధిపత్యం చెలాయించింది. కీలకమైన షూటౌట్లో ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా 10 పాయింట్ల షాట్తో విజయాన్ని ఖరారు చేసింది.

ఈ విజయంతో కుంకుమ్ మొహోద్కు మరో అరుదైన అవకాశం కూడా దక్కింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్కు భారత్కు వ్యక్తిగత కోటా స్థానాన్ని సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకంతో పాటు.. ఒలింపిక్స్కు కోటా స్థానం సాధించిన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో కుంకుమ్ ఆసియా క్రీడల్లో తన పతకాల సంఖ్యను మూడుకు పెంచుకుంది. ఇందులో రెండు స్వర్ణాలు ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande