దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఈ రోజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Train


గుంతకల్లు, 03 అక్టోబర్ (హి.స.)దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా బెంగళూరు-చర్లపల్లి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఈ రోజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

చర్లపల్లి-బెంగళూరు వీక్లీ ప్రత్యేక రైలు (నం. 07065) ఈనెల 5, 12, 19, 26, నవంబరు 2, 9, 16, 23, 27, 30 తేదీల్లో రాత్రి 9.50 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటిరోజు 1.15 గంటలకు బెంగళూరు చేరుకుంటుందన్నారు.

మచిలీపట్నం కర్నూలు ఎక్స్ప్రెస్ రైలు సేవలను ప్రారంభించాలని దక్షిణ తీర రైల్వే నిర్ణయించడం కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కొత్త ట్రై-వీక్లీ ఎక్స్ప్రెస్ ద్వారా రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సౌలభ్యం మరింత మెరుగుపడుతుంది. మొత్తం 499 కిలోమీటర్ల దూరం సాగే ఈ రైలు విజయవాడ మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

దీని తిరుగు ప్రయాణపు రైలు (నం.07066) ఈనెల 6, 13, 20, 27, అక్టోబరు 3, 10, 17, 24 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటిరోజు ఉదయం ఐదున్నరకు చర్లపల్లికి చేరుకుంటుందన్నారు. ఈ రైలు సికిందాబ్రాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యల్హంక స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.

మెము రైలు పాక్షిక రద్దు

బెంగళూరు, అనంతపురం మధ్య నడుస్తున్న మెము ప్యాసింజరు (నం. 66559/60) రైలును వివిధ తేదీల్లో 11 రోజులపాటు పాక్షికంగా రద్దు పరస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రంగేపల్లి-పెనుగొండ సెక్షన్లో ట్రాక్ రెన్యువల్ పనుల కారణంగా రైలును పాక్షికంగా రద్దుపరచినట్లు తెలియజేశారు. ఈనెల 4, 7, 9, 11, 14, 16, 18, 21, 23, 25, 28 తేదీల్లో రైలును బెంగళూరు-హిందూపురం సెక్షన్లో రద్దుపరిచామన్నారు. హిందూపురం-అనంతపురం సెక్షన్లో మాత్రమే నడుపుతామన్నారు.

తిరుపతికి ప్రత్యేక రైలు

పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి-విజయపుర మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. తిరుపతి-విజయపుర ప్రత్యేక వీక్లీ రైలు (నం. 07419) ఈనెల 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ ప్రతి ఆదివారం ఉదయం 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి అదేరోజు రాత్రి 10.25కి విజయపుర స్టేషన్కు చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07420) ఆదివారాల్లో రాత్రి 11.35 గంటలకు విజయపుర స్టేషన్లో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2.15 గంటలకు తిరుపతి చేరుకుంటుందన్నారు. ఈ రైలు రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, బళ్లారి, తోరణగల్లు, హోస్టేట, కొప్పల్, గదగ్, హోలే ఆలూరు, బాదామి, బాగల్కోట్, ఆల్మట్టి, బసవన బాగేవాడి రోడ్ స్టేషన్ల మీదుగా విజయపుర స్టేషన్కు చేరుతుందని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande