ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్- ఎమ్మెల్యే గిత్త జయసూర్య
నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రజల నుంచి పిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్


నందికొట్కూరు, 03 అక్టోబర్ (హి.స.)నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రజల నుంచి పిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనికి ముందు ఈ రోజు శనివారం ఉదయం అధికారితో కలిసి వార్డు సందర్శించారు. వార్డులోని ప్రజలను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande