శ్రీసిటీ బాయిలర్ పేలుడు ఘటనపై ఏపీ సీఎం , డిసిఎం తీవ్ర దిగ్భ్రాంతి
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు కార్మికులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్రీసిటీ బాయిలర్ పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు , డిసిఎం  పవన్ కల్యాణ్  తీవ్ర దిగ్భ్రాంతి!


తిరుపతి, 03 అక్టోబర్ (హి.స.) తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు కార్మికులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాద ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలో బాయిలర్ పేలి నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పవన్ విచారం వ్యక్తం చేశారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఔషధాలు తయారు చేసే ఈ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో విధుల్లో ఉన్న నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు మరియ డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు.

గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అలాగే శ్రీ సిటీ పరిధిలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్ష నిర్వహించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande