కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాంలో గిరిజన నాయకుల పర్యటన
కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నావైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నాయకులు
కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాంలో గిరిజన నాయకుల పర్యటన!


గుంతకల్లు, 03 అక్టోబర్ (హి.స.), అక్టోబర్ 3: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని గిరిజన శ్రేణులు నాయకలు మరియు వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నాయకులు నేడు దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న నాయకులు, గిరిజన ప్రతినిధులు స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకుల నుంచి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరిజన సమాజంతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు పరస్పరం కలుసుకుని గిరిజన సమాజానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నారు. గిరిజనుల ఐక్యత, వారి హక్కులు, సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాలపై సమిష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, మౌలిక వసతులపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande