ఏపీలో నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముగింపు
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం నేటితో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గడువు ముగుస్తుంది.
NOMINATION


అమరావతి , 30 అక్టోబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం నేటితో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గడువు ముగుస్తుంది. దీంతో ఇప్పటివరకు అభ్యర్థులు నిర్వహించిన బహిరంగ ప్రచార కార్యక్రమాలకు తెరపడనుంది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

నవంబర్ 1వ తేదీ ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం నవంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

మరోవైపు ప్రచార గడువు ముగిసిన వెంటనే ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయనున్నారు. ఆయా పట్టణ ప్రాంతాలకు సంబంధం లేని స్థానికేతరులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు కల్పిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande