కేంద్ర హోంమంత్రి దక్షతా పతకాలు ప్రకటన.. దేశవ్యాప్తంగా 490 మంది పోలీసు అధికారులకు విశిష్ట పురస్కారాలు!

న్యూఢిల్లీ, 31 అక్టోబర్ (హి.స.)

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు మరియు కేంద్ర పోలీసు సంస్థలకు చెందిన 490 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక కేంద్ర హోంమంత్రి దక్షతా పతకాలు ప్రకటించింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ ఈ పురస్కారాలను ప్రకటించింది. శాంతిభద్రతల పరిరక్షణ, భద్రత, నిఘా మరియు ఫోరెన్సిక్ సైన్స్ విభాగాలలో అసాధారణ ప్రతిభ చూపిన సిబ్బందికి ఈ అవార్డులను అందజేస్తారు. ఎంపికైన మొత్తం 490 మంది సిబ్బందిలో 358 మందికి అత్యంత సంక్లిష్టమైన ప్రత్యేక ఆపరేషన్లలో చూపిన విశేష నైపుణ్యానికి గాను ఈ గౌరవం దక్కింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్ సర్వీసెస్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ రంగాలలో అత్యుత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులతో పాటు ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలను కూడా ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande