మాతా భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది: ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళను ఆవిష్కరించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా!
మాతా భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది: ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళను ఆవిష్కరించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా!
image


న్యూఢిల్లీ:, 31 అక్టోబర్ (హి.స.)

అఖిల ప్రపంచ గాయత్రీ పరివార్ సహ-వ్యవస్థాపకురాలు మాతా భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారత ప్రభుత్వం ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళను (డాక్ టికెట్) విడుదల చేసింది. పార్లమెంట్ భవన్ ప్రాంగణంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర సమాచార మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంయుక్తంగా ఈ తపాలా బిళ్ళను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి విచ్చేసిన గాయత్రీ పరివార్ సభ్యులు, ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు. సమాజంలో మహిళా చైతన్యం, సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వికాసానికి మాతా భగవతీ దేవి శర్మ చేసిన సేవలను నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. మాతా భగవతీ దేవి శర్మ తన జీవితమంతా నైతిక విలువల స్థాపనకు, సమాజ శ్రేయస్సుకు ధారపోశారని కొనియాడారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈ స్మారక బిళ్ళ రాబోయే తరాలకు ఆమె ఆదర్శాలను, జాతీయ వికాసంలో నారీశక్తి ప్రాధాన్యతను గుర్తుచేస్తుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande