సింగ్ ఫోరమ్ 2026'లో ఛత్తీస్గఢ్ అభివృద్ధి విజిన్ను ఆవిష్కరించనున్న సీఎం విష్ణుదేవ్ సాయి!
సింగ్ ఫోరమ్ 2026'లో ఛత్తీస్గఢ్ అభివృద్ధి విజిన్ను ఆవిష్కరించనున్న సీఎం విష్ణుదేవ్ సాయి!
సింగ్ ఫోరమ్ 2026'లో ఛత్తీస్గఢ్ అభివృద్ధి విజిన్ను ఆవిష్కరించనున్న సీఎం విష్ణుదేవ్ సాయి!


రాయపూర్,, 04 అక్టోబర్ (హి.స.)

సింగపూర్ పర్యటనలో ఉన్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తన అధికారిక పర్యటనలో భాగంగా ఇవాళ ప్రతిష్టాత్మకమైన 'సింగ్ ఫోరమ్ 2026' (Sing Forum 2026) వేదికగా ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, నూతన విధానాలు మరియు భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన సమగ్ర విజిన్‌ను అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల ముందు ఉంచనున్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడం, ఐటీ, మౌలిక సదుపాయాలు మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఫోరమ్‌లో సీఎం సాయి ప్రసంగం కీలకంగా మారనుంది. ఛత్తీస్‌గఢ్‌‌లో ఉన్న అపారమైన వనరులు, సింగపూర్ తరహా ఆధునిక సాంకేతికత మరియు పెట్టుబడిదారులకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సౌకర్యాల గురించి ఆయన వివరించనున్నారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande