ఫారం 7 ద్వారా ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నం: అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణ
ఫారం 7 ద్వారా ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నం: అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణ
AIMIM's Asaduddin Owaisi


హైదరాబాద్, 04 అక్టోబర్ (హి.స.)

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు. అధికార బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్తలు ఫారం 7 (Form 7) ని ఉపయోగించి కావాలనే ముస్లిం ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

ఎన్నికల ప్రక్రియలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని, అర్హులైన ఓటర్ల పేర్లను అన్యాయంగా జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఎన్నికల సంఘం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఒవైసీ డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande