
ముంబై, 04 అక్టోబర్ (హి.స.)బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. వారం ప్రారంభంలోని ధరతో పోలిస్తే మేలిమి బంగారం ధరలో కేవలం రూ.350 మేర కోత పడింది.
అంతర్జాతీయ అనిశ్చితులతో పాటు యూఎస్ ట్రెజరీ బాండ్స్పై రాబడులు పెరగడంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి (అక్టోబర్ 4) 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,180గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,750కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,180 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,750 ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,180 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,750 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,330 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,900 ఉంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV