
దిల్లీ , 06 అక్టోబర్ (హి.స.)
మహిళా జర్నలిస్టులపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ పోలీసు అసిస్టెంట్ కమిషనర్ (ACP) వివేక్ భగత్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) హోదాలో కల్పించాల్సిన ప్రస్తుత విధి నిర్వహణ బాధ్యతలను (Current Duty Charge) దిల్లీ ప్రభుత్వం నిలిపివేసింది.
అక్టోబర్ 3న జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా మహిళా జర్నలిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ వివేక్ భగత్‌పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణ ముగిసే వరకు తాను ఆ అదనపు బాధ్యతలను స్వీకరించబోనని ఆయనే స్వయంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయన అదనపు ఛార్జ్‌ను నిలిపివేస్తూ, మిగిలిన అధికారుల జాబితాతో కూడిన సవరించిన ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫిర్యాదులను దిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు బదలాయించి సమగ్ర విచారణ జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi