ఏపీ కేబినెట్ భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలు, కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Chandrababu


అమరావతి , 07 అక్టోబర్ (హి.స.)ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పటికే న్యాయపరమైన దశలోకి వెళ్లింది. 34 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టి పెట్టింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన న్యాయపరమైన వ్యూహం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

కేబినెట్లో వివిధ ప్రభుత్వ సంస్థలకు భూముల కేటాయింపు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande