ఢిల్లీ-ఎన్సీఆర్లో భారీ భూకంపం
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. పలు చోట్ల కంపించిన భూమి
Earthquake of magnitude 2.6 jolts Ahmedabad at 4.39 am


ఢిల్లీ, 07 అక్టోబర్ (హి.స.)దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూప్రకంపనలు కలకలం రేపాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైనట్లు సమాచారం.

ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్లతో కూడిన ఎన్సీఆర్ పరిధిలో సుమారు 30 సెకన్ల పాటు బలంగా ప్రకంపనలు కొనసాగాయి. దీంతో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లలో నివసించే జనం భయంతో మెట్ల గుండా కిందకు దిగి ఖాళీ ప్రదేశాలు, రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ స్పష్టం చేసింది.

ప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లిందన్న సమాచారం ప్రస్తుతానికి తెలియరాలేదు. భూకంప కేంద్రం చమోలీ ప్రాంతంలో ఉండటంతో అక్కడి పరిస్థితులపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande