తిరుపతిలో 75 అడుగుల ప్రధాని మోదీ కటౌట్ ఆవిష్కరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం, 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
తిరుపతిలో 75 అడుగుల ప్రధాని మోదీ కటౌట్ ఆవిష్కరణ


తిరుపతి, 07 అక్టోబర్ (హి.స.) ప్రధాని మోదీ 25 ఏళ్ల రాజకీయ సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నేతలు తిరుపతిలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.

తిరుపతిలోని ఎస్వీ తారకరామ మైదానంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీకి సంబంధించిన 75 అడుగుల భారీ కటౌట్ను బీజేపీ నాయకులు ఆవిష్కరించారు.

మోదీ పాలన 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన 'సేవా సంకల్ప అభియాన్'లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పే లక్ష్యంతో 75 గంటల పాటు సాగే 'మోదీ జాతర' కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు.

అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తూ 1,000 మంది వేద పండితులతో ప్రత్యేక వేద ఆశీర్వచనం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశ్రీశ్రీ మాతంగి మహా పీఠాధిపతి నందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందించారు. అలాగే, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంగా 75 గంటల పాటు నిరంతరాయంగా నిర్వహించనున్న వినూత్న ‘మోదీ జాతర’ (డప్పు మోత) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పణతల సురేష్, జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైన, అభివృద్ధి చెందుతున్న దేశంగా సగర్వంగా ముందుకు సాగుతోందన్నారు. సమాజంలోని చిట్టచివరి నిరుపేద పౌరుడి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande