
అమరావతి, 07 అక్టోబర్ (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో పాటు రుతుపవనాల తిరోగమన ప్రక్రియ కొనసాగుతుండటంతో నేడు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత కొనసాగే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ వాతవారణం
బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తీరప్రాంత జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచానా వేసింది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక, హైదరాబాద్లో నేడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా, అక్కడక్కడా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉండటంతో నగరవాసులకు ఉక్కపోత తప్పకపోవచ్చు. అయితే, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వాతావరణం చల్లబడి నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లి, సికింద్రాబాద్, చార్మినార్ పరిసర ప్రాంతాలలో ఆకస్మిక జల్లులు కురిసే అవకాశముంది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ పరిసరాల్లో నమోదయ్యే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV