నేడు రూ.300 దర్శనం టికెట్ల విడుదల - బ్రహ్మోత్సవాల వేళ ఆ 10 రోజులు వీఐపీ బ్రేక్ రద్దు
తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ రోజు బుధవారం విడుదల చేయనుంది.
తిరుమల


తిరుమల, 07 అక్టోబర్ (హి.స.), తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ రోజు బుధవారం విడుదల చేయనుంది.

మరోవైపు బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి హుండీ ఆదాయం వివరాలను సైతం వెల్లడించింది.

అక్టోబరు నెలకు రూ.300 దర్శన టికెట్లను ఇప్పటికే ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది. అయితే అందులోని 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన టికెట్ల కోటాను మాత్రం హోల్డ్లో ఉంచింది. బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నందున ఈ తేదీలకు సంబంధించిన కోటాను అక్టోబరు 7 ఉదయం 10 గంటలకు ఆన్లైన్ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమైంది.

భక్తులు అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా ఈ టికెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande