ప్రముఖ నటుడు నానా పాటేకర్ మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
ప్రముఖ నటుడు నానా పాటేకర్ మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
నానా


హైదరాబాద్, 08 అక్టోబర్ (హి.స.)

ప్రఖ్యాత సినీ, రంగస్థల నటుడు నానా పాటేకర్ అక్టోబర్ 8, 2026 న గోవాలో ఆకస్మికంగా కన్నుమూశారు.

నానా పటేకర్ మరణవార్త దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దేశం కోసం, సమాజం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, యావత్ దేశంతో పాటు సంఘ్ కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించింది.. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత డాక్టర్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రముఖ సినీ, నాటక రంగ ప్రముఖుడు శ్రీ నానా పటేకర్ మృతి పట్ల యావత్ దేశంతో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆయన దుఃఖిత కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న నానా, తన సుదీర్ఘ కళా జీవితంలో నటనలో రాణించడమే కాకుండా, సామాజిక ప్రాముఖ్యత ఉన్న అనేక అంశాలపై సానుకూల చర్చలకు స్ఫూర్తినిచ్చారు.

ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి, శుభం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః॥ . అంటూ సంఘ ప్రకటనను విడుదల చేసింది.

నానా పాటేకర్ విశిష్ట వ్యక్తిత్వం, సేవాభావం:

హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నానా పాటేకర్, కేవలం తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరోగా నిలిచారు.

మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో మూడు సంవత్సరాలు సేవలందించి కమాండో శిక్షణ పొందిన ఆయన, కార్గిల్ యుద్ధ సమయంలో సైన్యంతో కలిసి సరిహద్దుల్లోని కఠిన ప్రాంతాల్లో సేవలందించారు. జమ్మూ కాశ్మీర్‌లో సైన్యంతో కలిసి చిన్నారులకు విద్యనందించే బృహత్ కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. మహారాష్ట్రలో రైతులు పడుతున్న ఇబ్బందులు, ఆత్మహత్యల వార్తలు చూసి చలించిపోయిన ఆయన, తాను కారు కొనుగోలు కోసం దాచుకున్న కోటీ యాభై లక్షల రూపాయలను వేలాది మంది రైతులకు ఆర్థిక సహాయంగా అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. 'నామ్ ఫౌండేషన్' (Naam Foundation) ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నడిపించారు.

ఆయన ఆకస్మిక మృతితో చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన చేసిన దేశ సేవలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చిరస్మరణీయమని ప్రముఖులు కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande