పసలపూడి - కాల్దరి గ్రామాల మధ్య పెద్దపులి సంచారం
పసలపూడి - కాల్దరి గ్రామాల మధ్య పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Tiger


అమరావతి, 09 అక్టోబర్ (హి.స.)

పసలపూడి - కాల్దరి గ్రామాల మధ్య పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసు, రెవెన్యూ అధికారులతో కలిసి పులి సంచారంపై ఆయా గ్రామాల్లో మైకులో ప్రచారం చేస్తూ ప్రజలు, రైతులను అప్రమత్తం చేస్తున్నారు.

అత్యవసరమైతేనే తప్ప ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉండ్రాజవరం మండలం పసలపూడి కోళ్లఫారం వద్ద పులి జాడ సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande