దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని 5,261 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మొత్తం 5,261 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
EV buses


అమరావతి , 09 అక్టోబర్ (హి.స.)దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మొత్తం 5,261 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.

ఈ ప్రత్యేక సేవలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి ప్రయాణించే వారికి ఉపయోగపడనున్నాయి.

పండుగ సమయాల్లో స్వగ్రామాలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలతో కలిసి ప్రయాణించే వారు ముందుగానే టికెట్లు పొందేందుకు ప్రయత్నిస్తారు. సాధారణ బస్సుల్లో సీట్లు లభించకపోవడం, బస్టాండ్లలో రద్దీ పెరగడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం ప్రయాణికులకు ఉపశమనం కలుగుతుంది. అక్టోబర్ 16 నుంచి 19 వరకు పండుగకు ముందు ప్రయాణాల కోసం 3,207 బస్సులు, అక్టోబర్ 20 నుంచి 25 వరకు తిరుగు ప్రయాణాల కోసం 2,054 బస్సులు నడపనున్నారు.

రూట్లవారీగా చూస్తే హైదరాబాద్కు 1,186, విజయవాడకు 1,053, బెంగళూరుకు 475, విశాఖపట్నానికి 440, రాజమండ్రికి 347, తిరుపతికి 247, చెన్నైకి 153 ప్రత్యేక బస్సులను అధికారులు కేటాయించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande