
ఢిల్లీ , 09 అక్టోబర్ (హి.స.)కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణా టీ., అల్లుడు మహమ్మద్ రియాస్ తదితరులపై ఆరోపణలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేరళ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.
ఈ కేసు ప్రధానంగా కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) సంస్థ నుంచి వీణా టీ.కి చెందిన ఐటీ సంస్థ ఎక్సాలోజిక్కు జరిగినట్లు ఆరోపణలు ఉన్న చెల్లింపులకు సంబంధించినది. ఆ చెల్లింపులు చట్టబద్ధమైనవేనా, వాటి వెనుక ఏవైనా అక్రమ ప్రయోజనాలు ఉన్నాయా అన్నది వివాదానికి కేంద్రబిందువుగా ఉంది.
అవినీతి నిరోధక చట్టం కింద నేరం జరిగినట్లు అనుమానించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయా అనే అంశంపై విచారణ అవసరమని పిటిషన్దారులు వాదించారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక విచారణ మాత్రమే కొనసాగించడం సరిపోదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్