రాష్ట్రవ్యాప్తంగా నకిలీ పన్నీర్ తయారీపై ఉక్కుపాదం – ఏడాది పాటు నిషేధం
తెలంగాణ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
Food SAFETY


హైదరాబాద్ , 09 అక్టోబర్ (హి.స.)తెలంగాణ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో కృత్రిమ రసాయనాలతో తయారు చేస్తున్న 'అనలాగ్ పన్నీర్' (నకిలీ పన్నీర్) విక్రయాలు, తయారీపై రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు పూర్తి నిషేధం విధిస్తూ ఈరోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లోని హోటళ్లు, డైరీ ఫామ్లపై అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. సుమారు 299 ఆహార తయారీ సంస్థల నుండి సేకరించిన శాంపిల్స్ ల్యాబ్ పరీక్షల్లో మానవ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే పదార్థాలు ఉన్నట్లు తేలింది. నిబంధనలు ఉల్లంఘించిన 56 సంస్థలకు షోకాజ్ నోటీసులు, మరికొన్ని సంస్థలకు భారీ జరిమానాలు విధించారు. ప్రజలు పండగ సీజన్లో పాల పదార్థాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, కల్తీకి పాల్పడే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande