పూజా మండపాలకు ఉచిత విద్యుత్ – ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దుర్గాదేవి పూజా మండపాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
Electricity


అమరావతి , 09 అక్టోబర్ (హి.స.)రాష్ట్రవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దుర్గాదేవి పూజా మండపాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. ఉత్సవ కమిటీలు ఎదుర్కొంటున్న విద్యుత్ ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు గానూ, పూజా మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయం ప్రకారం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రతి అధికారిక పూజా మండపానికి నిర్దేశిత కిలోవాట్ల (KW) పరిమితి లోపు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. తాత్కాలిక కనెక్షన్ల కోసం గతంలో వసూలు చేసే కమర్షియల్ ఛార్జీలను ఈ తొమ్మిది రోజుల పాటు పూర్తిగా రద్దు చేశారు. అయితే, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా మండపాల నిర్వాహకులు నాణ్యమైన వైరింగ్ ఉపయోగించాలని, విద్యుత్ శాఖాధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ఉత్సవ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande