బతుకమ్మ వేడుకల కోసం ప్రభుత్వ నిధులు విడుదల
తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకంగా రూ.10 కోట్ల నిధులను మంజూరు చేసింది.
Bhatukamma


హైదరాబాద్ , 09 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకంగా రూ.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను జిల్లాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, చెరువుల వద్ద లైటింగ్ మరియు ఘాట్ల మరమ్మతు పనుల కోసం ఖర్చు చేయనున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలలోని ప్రధాన ఆలయాల వద్ద మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. పండుగ రోజుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు మహిళా పోలీసు సిబ్బందిని రక్షణగా ఉంచాలని యంత్రాంగం నిర్ణయించింది. ఈ నిధుల విడుదలతో స్థానిక సంస్థలు వేడుకల సన్నాహాలను మరింత వేగవంతం చేశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande