
ముంబై, 09 అక్టోబర్ (హి.స.)కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు భారత్లో ఒక్కసారిగా పెరిగాయి.భారత్లోనూ శుక్రవారం గోల్డ్ రేట్లు డౌన్ అయ్యాయి. త్వరలో పండుగల సీజన్ వస్తున్న క్రమంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 9వ తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
వెబ్సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.00 గంటల సయయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,710కు ఎగబాకింది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.1,140 మేర పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,050 మేర పెరిగి రూ.1,38,150కు చేరుకుంది. వెండి ధర మాత్రం రూ.2.45 లక్షల (కిలో) వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
ఇవాల్టీ బంగారం ధరలు ఇవే..
-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,560 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,090గా ట్రేడవుతోంది.
-హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,49,560గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,090 వద్ద కొనసాగుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,49,560 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,090గా ఉంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,560 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,090 వద్ద ట్రేడవుతోంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,690గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,240 వద్ద ట్రేడవుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.35 లక్షలుగా ఉంది.
-హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2,44,900గా ప్రస్తుతం ఉండగా.. నిన్న ఈ ధర రూ.2.45 లక్షలుగా ఉంది.
-చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2,44,900గాఉండగా.. నిన్న ఈ రేటు రూ.2.45 లక్షలుగా ఉంది.
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద ప్రస్తుతం కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2.35 లక్షలుగా ఉంది
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV