
అమరావతి, 09 అక్టోబర్ (హి.స.)
ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. అది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.
దీని ప్రభావంతో ఏపీలో ఈ నెల 15 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రజలు, సంబంధిత అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ