
జగిత్యాల, 09 అక్టోబర్ (హి.స.)
జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆర్అండ్బై ఇంజినీరింగ్ అధికారులు శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, మెడికల్ కళాశాల విద్యార్థి నాయకులతో సమావేశం నిర్వహించారు.
మెడికల్ కళాశాల నిర్మాణ పనుల పురోగతి, విద్యార్థుల సమస్యలు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. జగిత్యాల మెడికల్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కళాశాలలో ఇంకా పూర్తికావాల్సిన నిర్మాణ పనులను గుర్తించి, వాటిని వేగంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా వసతులను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని తెలిపారు. పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు