రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
24గంటల ఉచిత కరెంటు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు.
Mla


పెద్దపల్లి, 09 అక్టోబర్ (హి.స.)

24గంటల ఉచిత కరెంటు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు.

మంథని కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు శుక్రవారం భారీ నిరసన కార్యక్రమం, రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 24 సరిపడా విద్యుత్ సరఫరా కాకపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మంథని పాత పెట్రోల్ బంకు చౌరస్తాలో రోడ్డుపై వరి నారు, ఎండిన పంటలతో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'రైతు బతికితేనే రాష్ట్రం బతుకుతుంది.. రైతుకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 3-4 గంటలు కూడా కరెంటు రావడం లేదని విమర్శించారు. వెంటనే వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande