స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు – ఎస్ఈసీ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత వీడింది. గత కొద్దిరోజులుగా కోర్టుల్లో నడుస్తున్న బీసీ రిజర్వేషన్ల వివాదంపై ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పునిస్తూ పిటిషన్ను కొట్టివేయడంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది.
Vote


అమరావతి , 09 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత వీడింది. గత కొద్దిరోజులుగా కోర్టుల్లో నడుస్తున్న బీసీ రిజర్వేషన్ల వివాదంపై ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పునిస్తూ పిటిషన్ను కొట్టివేయడంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల రోడ్మ్యాప్పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం అధికారికంగా ఓటర్ల జాబితా మరియు స్థానిక రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసిన వెంటనే, ఎస్ఈసీ తరఫున తాము ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి 'ప్లాన్ బీ' వ్యూహంతో ముందుకు సాగుతోంది. త్వరలోనే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి, వారి అభిప్రాయాలను సేకరించిన అనంతరం వార్డుల వారీగా తుది రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఈ పరిణామంతో అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలు క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande