
హైదరాబాద్, 09 అక్టోబర్ (హి.స.)
నేడు శుక్రవారo ఉదయం నష్టాలతో ప్రారంభం అయిన స్టాక్ మార్కెట్ .. నష్టాల భయాలు, అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ మందకొడిగా కొనసాగాయి. కానీ ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్లు అనూహ్యంగా యూ-టర్న్ తీసుకుని రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి.
మధ్యాహ్నం తర్వాత దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు గ్లోబల్ ఇన్వెస్టర్లు కీలక రంగాల్లో భారీగా కొనుగోళ్లకు దిగడంతో సూచీలు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. దీంతో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ (BSE Sensex) 879 పాయింట్లతో సరికొత్త స్థాయికి చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ (NSE Nifty) 288 పాయింట్లకు పైగా లాభపడి కీలక మార్కును విజయవంతంగా అధిగమించింది.
ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ (FMCG) రంగాల షేర్లలో భారీ ఎత్తున షార్ట్ కవరింగ్, సరికొత్త కొనుగోళ్లు వెల్లువెత్తడం మార్కెట్లకు భారీ ఊపునిచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్ఎఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి హెవీవెయిట్ షేర్లు మార్కెట్ ర్యాలీని ముందుండి నడిపించాయి. ప్రధాన సూచీలతో పాటు మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు కూడా ఒకటిన్నర శాతానికి పైగా లాభాల్లో ముగియడంతో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల రూపాయల మేర పెరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు