
కరీంనగర్, 09 అక్టోబర్ (హి.స.)
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భవానీ దీక్షను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మాలాధారణ చేసి, ఎర్రని వస్త్రాలు ధరించి దీక్ష చేపట్టారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 11 రోజులపాటు దీక్షలో కొనసాగుతూ ఆలయంలోనే ఉండి అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి పాల్గొననున్నారు. దీక్షా కాలంలో బండి సంజయ్ ఆలయంలోనే ఉంటూ అమ్మవారి సేవతోపాటు నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
వివిధ సమస్యలపై తనను కలిసేందుకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..