బాలికల వసతి గృహాన్ని సందర్శించిన వనపర్తి జిల్లా కలెక్టర్
వనపర్తి జిల్లా పెబ్బేరు లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం వసతి గృహాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
Collector


వనపర్తి, 09 అక్టోబర్ (హి.స.)

వనపర్తి జిల్లా పెబ్బేరు లోని

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల

ఆవరణలోని బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం వసతి గృహాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.

విద్యార్థినులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, తాగునీరు, వసతి గృహంలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారులు స్పందిస్తూ మొత్తం 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు, వారందరినీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్కు వివరించారు.

ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహంలో బుధవారం రాత్రి చికెన్ తో భోజనం చేసిన అనంతరం కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వసతి గృహంలో తాగునీటి శుద్ధి యంత్రానికి సంబంధించిన ఫిల్టర్ను వెంటనే మార్చించాలని, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రతను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande