డబ్ల్యూ టి ఎం లండన్ పర్యటనలో ఏపీ మంత్రి కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లండన్ లో పర్యటిస్తున్నారు.
మంత్రి కందుల దుర్గేష్!


అమరావతి, 09 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లండన్ లో పర్యటిస్తున్నారు.

వచ్చే నెల నవంబర్లో జరగబోయే డబ్ల్యూ టి ఎం లండన్ 2026 (ప్రపంచ ప్రయాణ మార్కెట్) ( WTM London 2026 (World Travel Market) ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రావెల్ మరియు టూరిజం ఈవెంట్లలో ఒకటి. ఈ పర్యటనలో భాగంగా మంత్రి పాల్గొననున్నారు.

ప్రపంచ పర్యాటక రంగంలో చోటుచేసుకుంటున్న నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై ప్రపంచ ప్రయాణ మార్కెట్లో విస్తృతంగా చర్చ జరగనుంది. ఈ చర్చల్లో మంత్రి దుర్గేష్ పాల్గొని ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సంబంధించిన అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించనున్నారు.

ప్రపంచ ప్రయాణ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా పాల్గొనే పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, డెస్టినేషన్ మేనేజ్మెంట్ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో మంత్రి దుర్గేష్ సమావేశం కానున్నారు. ఆయా సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను తెలియజేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande