పేద పిల్లలకు ఉచిత విద్య - ప్రభుత్వ హైస్కూళ్ల పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన
గొడ్డలి ప్రభుత్వం మూసేసిన వీఆర్సీ ఆధునికీకరణలో విద్యా యజ్ఞం ప్రారంభించానని మంత్రి నారాయణ అన్నారు.
నారాయణ


నెల్లూరు, 09 అక్టోబర్ (హి.స.)గొడ్డలి ప్రభుత్వం మూసేసిన వీఆర్సీ ఆధునికీకరణలో విద్యా యజ్ఞం ప్రారంభించానని మంత్రి నారాయణ అన్నారు. అదే స్ఫూర్తితో నెల్లూరు ఏసీ నగర్లోని మల్లెల సంజీవయ్య ప్రభుత్వ హైస్కూల్ను నూతన హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు.

ఇందులో భాగంగా హైస్కూల్ను రూ.9.69 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించేందుకు జిగ్మా కంపెనీ ముందుకొచ్చింది.

దీంతో ఈరోజు శుక్రవారం ఆధునికీకరణ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. కుమార్తె షరణితో కలిసి పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘గుడిసెలో పుట్టాను.. కష్టాల్లో పెరిగాను.. చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. హరనాథపురం నుంచి వీఆర్సీ వరకు కాలినడకన వెళ్లి చదువుకున్న రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో అన్ని పనులను తిరిగి ప్రారంభించామని ,2028 చివరికల్లా పనులు పూర్తి చేస్తామని చెప్పారు.

పేద పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే తన ఆలోచన అని అన్నారు.పేద పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నామని విద్యతో సమాజంలో మార్పు సాధించవచ్చన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. పిల్లలు బాగా చదివి జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు.నగరంలో పాలకుల నిర్వాకం వల్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande