
ప్రొద్దుటూరు, 09 అక్టోబర్ (హి.స.)ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు శాశ్వత తాగునీటి భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
ప్రొద్దుటూరు పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులోని R&B గెస్ట్ హౌస్కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మరియు కడప ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (RM), R&B శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రివర్యులకు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
ప్రొద్దుటూరు ప్రాంతంలో తాగునీటి మౌలిక వసతులను సమూలంగా బలోపేతం చేసేందుకు ఒకవైపు రూ.2,370 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా, మరోవైపు జల్ జీవన్ మిషన్ 2.0లో రూ.28.78 కోట్లతో 49 తాగునీటి పథకాలను పునరుద్ధరిస్తున్నామని ఆయన వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV