
రేణిగుంట, 09 అక్టోబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, మరియు రాబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు తిరుపతి జిల్లా రేణిగుంటలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా రేణిగుంట పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రావు,తహసీల్దార్ శ్రావణ్ కుమార్,ఎంపీడీఓ రవిచంద్ర, సీఐ జయచంద్ర సంయుక్తంగా రేణిగుంట పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులు, భద్రతా ఏర్పాట్లు, స్థానిక పరిస్థితులను సమీక్షించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలపై అధికారులు దృష్టి సారించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు, సమస్యాత్మక పరిస్థితులు తలెత్తే అవకాశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV