
అమరావతి , 09 అక్టోబర్ (హి.స.) వైఎస్సార్సీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దింతో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది.
ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం విచారించి, దానిని కొట్టివేసింది. ఈ తాజా తీర్పుతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది.
రాష్ట్రంలో ఎస్ఐఆర్ (SIR) తాజా జాబితా సిద్ధమైనా, లేక పాత జాబితాతోనైనా స్థానిక ఎన్నికలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేసింది.
ఇక రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే ఎన్నికలు జరపాలన్న వైసీపీ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాల్సి ఉంది. ఎస్ఐఆర్ జాబితా వెలువడితే తాజా జాబితాతో ఎన్నికలు నిర్వహించవచ్చని సుప్రీం కోర్ట్ పేర్కొనది. లేదా పాత జాబితాతోనే ఎన్నికలకు వెళ్లాలని తెలిపింది. హైకోర్టు ఇచ్చిన ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే... ఏ ఓట్ల జాబితాతో ఎన్నికలు నిర్వహింస్తుందో అనేది ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV