తిరుమల శ్రీవారి సన్నిధిలో విజయసాయిరెడ్డి.......టీడీపీ నేతను కొత్త పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి..
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే తన పార్టీ పేరు, జెండాను ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి అంటున్నారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలో విజయసాయిరెడ్డి


తిరుమల, 09 అక్టోబర్ (హి.స.)మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే తన పార్టీ పేరు, జెండాను ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి అంటున్నారు.

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.కొత్త పార్టీని ప్రారంభించబోతున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు.

తన ఆప్తమిత్రుడు రమణతో కలిసి స్వామివారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో నాలుగేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యులుగా భావసారూప్యతతో కలిసి పనిచేశామని అన్నారు. తన నూతన రాజకీయ ప్రయాణంలో తనతో కలిసి రావాలని రమణను ఆహ్వానించినట్టు తెలిపారు. ఇద్దరం కలిసి పనిచేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అంతేకాదు కొత్త పార్టీ ఆవిర్భావం గురించి.. తనతో చాలామంది కలిసి పనిచేయబోతున్నారని చెప్పుకొచ్చారు. తన కొత్త పార్టీలోకి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ ను ఆహ్వానిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. గతంలో ఓవీ రమణ, తాను నాలుగేళ్ల పాటు టీటీడీ పాలకమండలి సభ్యులుగా కలిసి పని చేశామని గుర్తు చేశారు. రమణ అంగీకరిస్తే రాజకీయ ప్రయాణంలో కొత్త పార్టీలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande