నవంబర్ 13 నుంచి 24 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
భారత సైన్యంలో అగ్నివీర్గా చేరాలనుకునే యువతకు మరో అవకాశం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో నవంబర్ 13 నుంచి 24వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.
Indian Army


హైదరాబాద్ , 01 నవంబర్ (హి.స.)

భారత సైన్యంలో అగ్నివీర్గా చేరాలనుకునే యువతకు మరో అవకాశం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో నవంబర్ 13 నుంచి 24వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నియామక ప్రక్రియలో తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.

ఈ ర్యాలీ ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ట్రేడ్స్మెన్ విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే రిక్రూట్మెంట్ ప్రక్రియలో అర్హత సాధించి అడ్మిట్ కార్డులు పొందిన అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ర్యాలీకి హాజరుకావాలని అధికారులు సూచించారు. స్టేడియానికి వచ్చే సమయంలో అడ్మిట్ కార్డుతో పాటు అవసరమైన అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని స్పష్టం చేశారు.

నియామకాలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ఇతర వివరాలు తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు 040-27740059 నంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. అలాగే భారత సైన్యం అధికారిక వెబ్సైట్ www.joinindianarmy.nic.in ద్వారా కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande