పులివెందులలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
Police


పులివెందుల , 01 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు యర్రగుడిపల్లి వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు ఎదురుపడటంతో వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తోపులాటకు దారితీసింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఇరువర్గాల వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో కొంతసేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు కడపలోని మానస కల్యాణ మండపం వద్ద కూడా గందరగోళం నెలకొంది. పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఏజెంట్ల వద్ద ఉన్న పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande